ప్రేమ ఇష్క్ కాదల్ కి నారా రోహిత్ వాయిస్ ఓవర్

ప్రేమ ఇష్క్ కాదల్ కి నారా రోహిత్ వాయిస్ ఓవర్

Published on Nov 28, 2013 2:23 PM IST

12

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా, చిన్న పెద్ద హీరోలని సంబంధం లేకుండా దాదాపు అన్ని సినిమాలకి ఎవరో ఒక హీరో వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. అదే కోవలోకే డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా వచ్చి చేరింది. ఈ సినిమాకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ వాయిస్ ఓవర్ సినిమా మొదట్లో మరియు పాత్రల పరిచయం చేసేటప్పుడు వచ్చే అవకాశం ఉందివచ్చే అవకాశం ఉంది. ఈ రికార్డింగ్ తో ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

‘తకిట తకిట’, ‘అవును’ ఫేం హర్ష వర్ధన్ రాణే, విష్ణువర్ధన్, హరీష్, వితిక, రితు, శ్రీ ముఖి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేం శ్రవణ్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. పవన్ సదినేని డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమాని బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నాడు.

తాజా వార్తలు