నారా రోహిత్ మరియు నిత్యమీనన్ ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “ఒక్కడినే”. గులాబి మూవీస్ బ్యానర్ మీద సీవి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో “కథ” చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంకి కథే ప్రధాన బలమని నారా రోహిత్ మరియు నిత్య మీనన్ ఈ చిత్రంలో తమ నటనతో ప్రేక్షకులను అలరించనున్నారని నిర్మాత అన్నారు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 14న విడుదల చేస్తారు. నవంబర్లో ఈ చిత్ర విడుదల ఉంటుంది. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సాయికుమార్, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇదిలా ఉండగా నారా రోహిత్ ప్రస్తుతం “మద్రాసి” మరియు కార్తికేయ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు.