నారా రోహిత్ ఏ హీరోకీ మాటివ్వలేదట

నారా రోహిత్ ఏ హీరోకీ మాటివ్వలేదట

Published on Nov 4, 2020 3:00 AM IST


నారా రోహిత్.. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఎంచుకునే కథల్లో కూడ వైవిధ్యం ఉంటుంది. కెరీరో ‘బాణం, సోలో, రౌడీ ఫెలో’ లాంటి హిట్ సినిమాలున్నాయి. కానీ వరుసగా పరాజయాలు ఎదురవడంతో ఆయన వెనుకబడ్డారు. లుక్స్ మీద కూడ కామెంట్స్ రావడంతో కొత్తగా కనిపించడానికి ట్రై చేసున్నారు. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా సినిమాలేవీ చేయలేదు. ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చారు. రెగ్యులర్ మూస కథలు కాకుండా కొత్తగా ట్రై చేయాలనే ఉద్దేశ్యంతో స్టోరీల కోసం ఎదురుచూశారు.

కానీ ఈలోపు ఆయన అల్లు అర్జున్ కొత్త చిత్రం ‘పుష్ప’లో ఒక కీ రోల్ చేస్తారని బలమైన వార్తలు వచ్చాయి. సినిమా సన్నిహిత వర్గాలు సైతం ఆ వార్తల్ని ధృవీకరించాయి. కానీ తాజాగా ఆయన ఆ చిత్రంలో నటించట్లేదని స్పష్టమైంది. అలాగే కొత్తగా నాని చేస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’లో కూడా రోహిత్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వాటిలో కూడ నిజంలేదని అంటున్నారు. పూర్తిగా లుక్ మార్చుకున్న ఈ నారా హీరో త్వరలోనే సోలో హీరోగా కొత్త చిత్రం మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ‘

తాజా వార్తలు