టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసే నారా రోహిత్, రీసెంట్గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సుందరకాండ’ మంచి బజ్తో రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయింది. దీంతో ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను మెప్పించేందుకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో ఈ చిత్రం తాజాగా స్ట్రీమింగ్కు వచ్చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్కు రావడంతో ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాలో శ్రీదేవి విజయ్ కుమార్, విర్తి వాఘని హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేయగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి