హీరో నాని వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. చేతిలో రెండు సినిమాలు ఉండగానే మూడవ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో ఆయన సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది నాని 28వ చిత్రం. ఈ సినిమాను రేపు ఉదయం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎవరు, సినిమా ఎలా ఉండబోతోంది లాంటి వివరాలకు కూడా రేపే తెలియనున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ మునుపు నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని చేయడం జరిగింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2019లో విడుదలైంది. ఈ కొత్త చిత్రం వీరిలో కలయికలో రెండవది కానుంది. ఇకపోతే ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్న నాని రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో ‘శ్యామ్ సింగ రాయ్’ చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక మైత్రీ మూవీస్ సినిమాను చేయనున్నారు.