“శ్యామ్ సింగ రాయ్”లో నాని రోల్ ఇదేనా?

“శ్యామ్ సింగ రాయ్”లో నాని రోల్ ఇదేనా?

Published on Nov 5, 2020 8:59 PM IST


తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియెన్స్ కు ఏంత్తో దగ్గర కాబడిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు పలు ప్రాజెక్టులలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి రీసెంట్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న “శ్యామ్ సింగ రాయ్” ఒకటి. ఇటీవలే నిర్మాతల విషయంలో పెద్ద సస్పెన్సు నడిచిన ఈ చిత్రంకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు మరిన్ని తెలుస్తున్నాయి. అనౌన్స్మెంట్ తోనే మంచి ఆసక్తి రేపిన ఈ చిత్రంలో నాని ఒక ఫిల్మ్ మేకర్ లా కనిపిస్తాడట.

అలాగే ఈ రోల్ ను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారట. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరోసారి నటిస్తుండగా లేటెస్ట్ గా ఇంట్రో అయిన హీరోయిన్ కృతి శెట్టి మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ చిత్రాన్ని కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో మంచి బడ్జెట్ లోనే తెరకెక్కించనున్నారట. గతంలో “మజ్ను” సినిమాలో నాని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపించాడు. ఇప్పుడు ఫుల్ ఫ్లడ్జ్ రోల్ లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాలో రోల్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా వార్తలు