న్యాచురల్ స్టార్ నాని కోసం ‘మహర్షి’ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫుల్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అఫీషియల్ క్కన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు రాలేదు. కాకపోతే వీరి కాంబినేషన్ లో సినిమా కచ్చితంగా వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తోంది.
నిజానికి ‘మహర్షి’ తరువాత వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే చేయాలకున్నా కథ కుదరక ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు. ఆ తరువాత వంశీ పైడిపల్లి తన తరువాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గాని, ప్రభాస్ తో గాని ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఒక దశలో చరణ్ తో సినిమా చేస్తున్నాడని కూడా బాగా వినిపించింది.
మొత్తానికి నానితో సినిమాని ఫిక్స్ చేయబోతున్నాడట. త్వరలోనే నానికి కథ చెప్పి ఒప్పించాలని వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. మరి ఈ సారి వంశీ నానితో సినిమా చేస్తే ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి.