‘ది ప్యారడైజ్’ సెన్సేషన్.. ఓటిటి, ఆడియో కలిపి రికార్డు బిజినెస్

నాచురల్ స్టార్ నాని ఇపుడు ఏ రేంజ్ ఫామ్ ని మైంటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ హిట్ 3 తో భారీ హిట్ అందుకున్న నాని ఇపుడు ది ప్యారడైజ్ తో సెన్సేషన్ ని సెట్ చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు. దర్శకుడు శైలేష్ కొలనుతో ప్లాన్ చేసిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ భారీ అంచనాలు సెట్ చేసుకున్న సినిమా ఆడియో ఒక దానికే 18 కోట్లు జరుపుకున్నట్టుగా టాక్ వచ్చింది.

మరి ఇది కాకుండా ఓటిటి డీల్ కూడా కలిపి సుమారు 80 కోట్ల బిజినెస్ ని ది ప్యారడైజ్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇలా ఇంకా షూటింగ్ మొదలు కూడా పెట్టుకోని ఈ సినిమా ఈ రేంజ్ బిజినెస్ చేయడం అనేది నాని స్టామినా అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ వరల్డ్ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది.

Exit mobile version