నాని సైన్ చేసిన సినిమాల్లో ‘టక్ జగదీష్’ కూడా ఒకటి. ఈ చిత్రాన్ని ‘నిన్నుకోరి, మజిలీ’ ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేయనున్నాడు. టైటిల్ వెరైటీగా ఉండటంతో సినిమాపై ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు సినిమా నుండి ఫస్ట్ లుక్ మాత్రమే విడుదలకాగా నేడు కొత్త అప్డేట్ వచ్చింది. నేడు ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా పూజ కార్యక్రమాలతో ఈ మూవీని మొదలుపెట్టారు. వచ్చే నెల 11నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్యన ఉండే ఎమోషన్స్ కీలకంగా ఉంటాయని, నాని సోదరుడిగా సీనియర్ నటుడు నటించనున్నారట. ఈ సినిమాను శివ నిర్వాణతో ‘మజిలీ’ చిత్రాన్ని నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలు నిర్మిస్తున్నారు. ఇందులో రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.