రైజింగ్ హీరో నాని మరియు టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల భామ సమంత జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. ఈ చిత్రం ఆడియో విడుదల తేదీ ఖారారైంది. ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. సరికొత్త పంథాలో ప్రేమ కథా చిత్రాలు తీసే దర్శకుడు గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఆడియో హక్కులని ఈ సోనీ మ్యూజిక్ సంస్థ కొనుక్కున్నారు.
ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు మరియు ఆయన అందించిన పాటలు ఈ చిత్రానికి హైలైట్ అవుతాయానికి అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లబిస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే సారి తెరకెక్కిస్తున్నారు. తమిళంలో జీవా హీరోగా నటిస్తున్నారు.