దుబాయ్ నుండి తిరిగొచ్చిన నాని,కృష్ణ వంశీ

Krishna-Vamsi-and-Nani
నాని మరియు కృష్ణవంశీల కాంబినేషన్లో రానున్న చిత్రం చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యింది ఈ మధ్యనే రెండు పాటల చిత్రీకరణ కోసం దుబాయ్ కి వెళ్ళారు. కేథరిన్ తెరెసా కథానాయికగా నటిస్తుండగా ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పల్ల నిర్మిస్తున్నారు ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి ఉంటుందని చెబుతున్నారు. ఓల్డ్ సిటీలో మోడల్ గా నాని కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రలో నాని కనిపించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా నాని నటించిన “ఎటో వెళ్లిపోయింది మనసు” చిత్రం డిసెంబర్ 14న విడుదలకు సిద్దమయ్యింది రేపటి నుండి ఈ నటుడు ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటారు. కృష్ణ వంశీ చిత్ర చిత్రీకరణ పూర్తయ్యాక నాని సముద్రఖని చిత్రం మీద మరియు “బ్యాండ్ బాజా బారాత్” చిత్ర రీమేక్ మీద దృష్టి సారించనున్నారు.

Exit mobile version