త్వరలోనే ఒక ఇంటివాడు కానున్న నాని

త్వరలోనే ఒక ఇంటివాడు కానున్న నాని

Published on Aug 12, 2012 8:10 PM IST


ప్రస్తుతం నాని టాలీవుడ్లో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో. ఈ రోజు ఉదయం నానికి వైజాగ్ కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంజన అమ్మాయితో నిశితార్డం జరిగింది. ఈ ఇద్దరు చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ అని సమాచారం. నానికి త్వరలోనే అంజన అనే అమ్మాయితో నిశ్చితార్దం జరగనుందని ఇటీవలే వచ్చిన వార్తలను నాని కొట్టి పారేశారు. కానీ ఈ రోజు నిశ్చితార్ధం జరగగానే ‘ నాకు నిశ్చితార్దం జరిగింది’ అని నాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ పెళ్లి మాత్రం వచ్చే సంవత్సరంలో జరగనుంది. నాని ‘ఈగ’ లాంటి సూపర్ హిట్ చిత్రం తన ఖాతాలో వేసుకున్న తర్వాత నానికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. తన రాబోయే చిత్రాలతో నాని డిమాండ్ ఉన్న హీరోల లిస్టులో చేరిపోతారు. నాని నటిస్తున్న ‘ ఎటో వెళ్ళిపోయింది మనసు’, కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మరియు ‘జెండా పై కపిరాజు’ చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తాజా వార్తలు