డి ఫర్ దోపిడీ కి నాని వాయిస్ ఓవర్

nani
గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ లో ఆరోగ్యవంతమయిన ట్రెండ్ నడుస్తుంది కొంతమంది ప్రధాన తారలు మరొక చిత్రానికి డబ్బింగ్ చెప్పడం. పవన్ కళ్యాణ్ “జల్సా” కి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు, సునీల్ “మర్యాద రామన్న” కి రవితేజ, మంచు విష్ణు “దేనికయినా రెడీ” కి ప్రభాస్ డబ్బింగ్ చెప్పారు. తాజాగా వరుణ్ సందేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలలో రానున్న “డి ఫర్ దోపిడీ” చిత్రానికి హీరో నాని వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు.ఇప్పటికే అయన డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. సిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ & డీకే నిర్మిస్తున్నారు. మెలనీ కన్నోకడ ఈ చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ చిత్రం బ్యాంకు దోపిడీ నేపధ్యంలో ఉండబోతుంది ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మధ్యలో విడుదల చెయ్యడానికి సన్నాహలు చేస్తున్నారు.

Exit mobile version