మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో యువ నటుడు హర్ష రోహన్ మరో ప్రధాన పాత్రలో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రమే “కోర్ట్”. మరి నాచురల్ స్టార్ నాని నిర్మాణం వహించిన ఈ చిత్రం సాలిడ్ ప్రమోషన్స్ నడుమ గ్రాండ్ పైడ్ ప్రీమియర్స్ కూడా జరుపుకొని నేడు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కి వచ్చింది.
అయితే ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ స్టార్ట్ ని అందుకోవడం విశేషం. అక్కడ ఈ సినిమాకి జస్ట్ ప్రీమియర్స్ తోనే లక్ష 50 వేల డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టడం గమనార్హం. దీనితో యూఎస్ మార్కెట్ కోర్ట్ చిత్రానికి ఆదరణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని నిర్మాణం వహించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.
#Court makes a grand entry in the USA, grossing over $150K+ & counting at the premieres ????⚖️????????
A clear testament to the audience’s love and support ????????@NameisNani @PriyadarshiPN @walpostercinema#CourtStateVsANobody pic.twitter.com/d4QApwabb3
— Prathyangira Cinemas (@PrathyangiraUS) March 14, 2025