
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పైసా'(వర్కింగ్ టైటిల్). ఈ సినిమా ద్వారా కాథెరిన్ తెరిసా తెలుగు వారికి పరిచయం కానుండగా, లక్కీ శర్మ మరో కథానాయికగా నటిస్తున్నారు. మామూలుగానే పాటలను అద్భుతంగా చిత్రీకరించడంలో కృష్ణ వంశీకి ప్రత్యేక పేరు ఉంది. అలాంటి కృష్ణ వంశీ ఈ సినిమాలో సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఓ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటలో నాని వేసుకునే కాస్ట్యూమ్స్ కే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సినిమాలో సందర్భానుసారంగా వచ్చే పాటలో నాని బాగా రిచ్ కుర్రాడిగా కనపడాలి. అందుకోసమే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ పాట కోసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ పాటలో నాని వేసుకునే షూట్స్ లో ప్రపంచ ప్రసిద్ద గాంచిన ‘స్వరౌస్కి క్రిస్టల్స్’ ని ఉపయోగించారు. అందువల్లే ఈ పాటకి కోటి రూపాయల వరకూ ఖర్చు అవుతోందని సమాచారం. ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇంతక ముందు మైఖేల్ జాక్సన్ ఎక్కువగా ఉపయోగించేవారు. ఎలాగైతేనేం ఇంత ఖరీదైన కాస్ట్యూమ్స్ కి కృష్ణ వంశీ క్రియేటివిటీ తోడైతే ఆ పాట ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సినీ ప్రేమికులని మాత్రం ఈ పాట ఒక అద్భుతమైన అనుభూతికి గురిచేస్తుందని అందరూ అంటున్నారు.