నందు, అవికా గోర్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ “అగ్లీ స్టోరీ” నవంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రియా జియా ప్రొడక్షన్స్ పతాకంపై సీహెచ్ సుభాషిణి, కొండా లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రణవ స్వరూప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, టీజర్ మరియు పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో నందు, అవికా గోర్‌తో పాటు రవితేజ మహాదాస్యం, శివాజీ రాజా, ప్రజ్ఞా నయన్ ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రణవ స్వరూప్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. శ్రీసాయికుమార్ దారా సినిమాటోగ్రఫీ అందించగా, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ నవంబర్ 21న విడుదల కానున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. (edited)
