మహేష్ సతీమణి నమత్ర శిరోద్కర్ కొన్ని రోజులుగా వాళ్ల గారాలపట్టి సితార వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సితార అల్లరి వీడియోలతో పాటు, సింగింగ్, డాన్సింగ్ టాలెంట్స్ కూడా పరిచయం చేస్తున్నారు. ఇక తాజాగా నమత్ర మహేష్ నటించిన స్పైడర్ సినిమాలో బూమ్ బూమ్ సాంగ్ ని పాడుతున్న వీడియో పోస్ట్ చేశారు. అలాగే వారికి ప్రయాణంలో సితార ఉంటే చాలు, ప్రత్యేకంగా ఎంచుకున్న పాటల ఆల్బమ్ మరియు ప్లే లిస్ట్ అవసరం లేదని చెవుతున్నారు.
చిచ్చర పిడుగు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఓ యూ ట్యూబ్ ఛానెల్ కూడా సితార నడుపుతుంది. ఆ ఛానెల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. సితార వీడియోలు మహేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటాయి. ఇక మహేష్ అభిమానులు ఆయన నూతన చిత్ర ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
https://www.instagram.com/p/CAHWxLWjz3m/?igshid=12mdhxy1gw4u4