నాగార్జున తను చేయబోయే తరువాతి చిత్రం కోసం చాలా హొమ్ వర్క్ చేస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం ఆయన ‘శిరిడి సాయి’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోని గెటప్ కోసం ఆయన తన లైఫ్ స్టైల్ నే మార్చుకున్నారు. సాయి బాబా అవతారంలో ఉండే ప్రకాశవంతమైన తేజస్సు కోసమైనా ఆయన మంసాహరాలు ముట్టకుండా శాకహారిగా మారి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో రాఘవేంద్రరావు డైరెక్షన్లో అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి భక్తిరస చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.