మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ

Vayuputra

ఇటీవల వచ్చిన 3డి యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా దగ్గర ఏకంగా 300 కోట్ల గ్రాస్ అందుకున్న యానిమేటెడ్ సినిమాగా సంచలనం సెట్ చేసింది. ఇక ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు వస్తుండగా ఈ సినిమా తర్వాత సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నిర్మాత నాగవంశీ వచ్చారు.

తాను కూడా 3డి యానిమేషన్ లో “వాయుపుత్ర” అనే భారీ యానిమేటెడ్ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాని కార్తికేయ, తండేల్ సినిమాలు తెరకెక్కించిన చందూ మొండేటి తెరకెక్కిస్తుండడం విశేషం. ఇక ఈ సినిమాని ఆల్రెడీ వచ్చే ఏడాది దసరా రేస్ రిలీజ్ కి కూడా లాక్ చేసేసారు. అలాగే దీనిపై వదిలిన పోస్టర్స్ కూడా మంచి పవర్ఫుల్ గా కనిపిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Exit mobile version