మంచి లాభాలు దక్కించుకున్న రాజన్న?


ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఆనందానికి కారణం ‘రాజన్న’ చిత్ర విజయం. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా మంచి లాభాలు కూడా దక్కించుకుంటోంది. మొదటి రోజు కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ రెండవ రోజు ప్రేక్షకులు నుండి మంచి స్పందన లభించింది. ఆంధ్ర ప్రదేశ్ ఏరియాలో దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పంపిణీ హక్కులు ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు దక్కించుకున్నారు. కర్ణాటక ఏరియాకు గాను దాదాపుగా 1 కోటి 25 లక్షలు దక్కించుకోగా విదేశాలలో నాగార్జున గారే స్వయంగా విడుదల చేసారు. ఇవే కాకుండా సాటిలైట్ రైట్స్ రూపంలో కూడా భారీ లాభం పొందారు. బాక్స్ ఆఫీస్ కింగ్ గా నిరూపించుకున్న నాగ్ ఫ్యాన్స్ నాగార్జునని కింగ్ అని పిలుచుకుంటారు.

Exit mobile version