టాలీవుడ్ మన్మధుడు చాలా కాలం తర్వాత చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘లవ్ స్టొరీ’. ప్రస్తుతం హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతోంది. ఇక్కడ నాగార్జున , నయనతార మరియు కళాతపస్వి కె. విశ్వనాధ్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
గతంలో నాగార్జునకి ‘సంతోషం’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దశరథ్ ఈ చిత్రానికి దర్శకుడు. కామాక్షి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీరా చోప్రా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున మరియు నయనతార సరికొత్త లుక్ తో కనిపించనున్నారు.