జూలైలో రానున్న నాగార్జున భాయ్

nag-bhai

‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘భాయ్’ సినిమా జూలైలో విడుదల కావడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 28 నుంచి హైదరాబాద్లో మొదలు కానుంది. జూన్ చివరికల్లా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీం సక్సెస్ఫుల్ గా స్లొవేనియా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో నాగార్జున – రిచా గంగోపాధ్యాయ్ మీద కొన్ని పాటలను షూట్ చేసారు.

‘ఆహ నా పెళ్ళంట’, ‘పూల రంగడు’ సినిమాలు తీసిన వీరభద్రం చౌదరి ఈ సినిమాకి డైరెక్టర్. నాగార్జున సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version