నిన్న విడుదలైన నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జునే స్వయంగా నిర్మించాడు. ఇప్పటివరకూ నాగార్జున సొంతంగా సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు.
ప్రస్తుతం నాగార్జున ‘ఉయ్యాల జంపాల’ అనే ఒక లో-బడ్జెట్ సినిమాను ఇప్పటివరకూ ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై స్కూల్’ సినిమాలను నిర్మించిన రామ్ మోహన్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డి సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. విరంచి వర్మ దర్శకుడు. రవీందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్. సున్నీ ఎం.ఆర్ సంగీతాన్ని అందించారు. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకాదరణ పొందుతుంది.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ లో నటించిన ఆనంది హీరోయిన్ గా పరిచయం కానుంది. ఇప్పటికే పలు షార్ట్ ఫిలింస్ లో నటించిన తరుణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనుంది