భాయ్ పోరాటాలలో పాల్గోనున్న గ్రీకువీరుడు

భాయ్ పోరాటాలలో పాల్గోనున్న గ్రీకువీరుడు

Published on Jun 26, 2013 8:45 PM IST

Nagarjuna
‘కింగ్’ అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘భాయ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ మాస్ ఎంటర్టైనర్లో రేపటినుండి నాగార్జునతో ఒక ఫైట్ సీక్వెన్స్ ను తియ్యనున్నారు. ఈ సన్నివేశాలను ఓల్డ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించనున్నారు.

ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ . వీరభద్రమ్ దర్శకుడు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు నెల మధ్యలో విడుదలకానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు