‘కింగ్’ అక్కినేని నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘హలో బ్రదర్’ సినిమా ఒకటి, ఈ చిత్రం ఇప్పటికీ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నాగార్జున తన రాబోయే చిత్రం ‘భాయ్’తో మళ్ళీ ‘హలో బ్రదర్’ లాంటి చిత్రాన్నిప్రేక్షకులకు అందించనున్నారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా ‘హలో బ్రదర్’ లాగా సూపర్ హిట్ అవుతుందని నాగార్జున ఎంతో నమ్మకంగా ఉన్నారు.
ప్రస్తుతం నాగార్జున దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టొరీ’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ పూర్తవగానే ‘భాయ్’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. 2012లో ‘పూల రంగడు’ చిత్రంతో హిట్ కొట్టిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్ పై స్వయంగా నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రంలో రిచా గంగోపద్యాయ కథానాయికగా నటించనుంది.