ఈరోజు రాత్రి జురిచ్ బయలుదేరనున్న నాగార్జున


నాగార్జున ఈరోజు రాత్రి స్విట్జర్లాండ్ బయలుదేరనున్నారు. అయన నటిస్తున్న చిత్రం “లవ్ స్టొరీ” చిత్ర బృందాన్ని కలవడానికి జురిచ్ వెళ్లనున్నారు. ఇక్కడ నాగార్జున మరియు నయనతారల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.తరువాత మరో షెడ్యూల్ కోసం చిత్ర బృందం అమెరికా పయనమవనున్నారు. దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా డి శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని కామాక్షి కళా మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో నవంబర్ రెండవ వారంలో విడుదల కానుంది అని అయన తెలిపారు. ఈ చిత్రం ప్రేమ కథ చిత్రంగా ఉండబోతుంది ఇందులో నాగార్జున మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఎన్నారైగా కనిపించనున్నారు. మీరా చోప్రా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పాత్ర కోసం నాగార్జున తన లుక్ ని మార్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.

Exit mobile version