నిర్మాణంపై శ్రద్ధ చూపనున్న నాగార్జున

Nagarjuna
ఉయ్యాల జంపాల సినిమా విజయం నాగార్జునకు చిన్న సినిమాలపై నమ్మకాన్ని పెంచింది. ఆయన ఈ సంవత్సరం నటించిన ‘గ్రీకువీరుడు’, ‘భాయ్’ సినిమాలు పరాజయంపాలయ్యాయి. కాకపోతే ఉయ్యాల జంపాల సినిమా అందరి మన్ననలను అందుకుంది

వచ్చే యేడాది ఆయన ప్రణాళికను అడిగితే”2014లో నిర్మాణ రంగంపై దుష్టిపెట్టనున్నాను. మనం సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అఖిల్ ఈ యేడాది హీరోగా పరిచయంకానున్నాడు. అతనిపై శ్రద్ధ తీసుకోవాలి” అని తెలిపారు

అఖిల్ ఎంట్రీ వచ్చే యేడాదే అని మేము ముందుగానే తెలిపాము. కొంతమంది దర్శకులతో ఈ విషయమే మంతనాలు జరుపుతున్నాడు. నాగార్జున నిర్మించనున్న సినిమా గనుక అఖిల్ ఎంట్రీ ఎలా వుండబోతుందో చూడాలి

Exit mobile version