వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్ టి ఆర్ – నాగార్జున?

nag-and-ntr
గత కొద్ది రోజులుగా తెలుగు సినీ అభిమానులు కంటున్న కల నిజం కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా మల్టీ – స్టారర్ సినిమా కోసం వేచి చూస్తున్న అభిమానులకు మరోసారి ఇంటరెస్టింగ్ స్టార్స్ కాంబినేషన్ లో సినిమా రానుంది. గత కొద్ది రోజులకు ముందు పవన్ కళ్యాణ్, వెంకటేష్ కలిసి తీస్తున్న ప్రాజెక్ట్ ను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరమీదకు రానుంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున, యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ లు మరో ప్రాజెక్ట్ లో కలిసి నటించనున్నారని ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించానున్నాడని సమాచారం. పివిపి సినిమాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఈ సినిమాకు సంబందించిన చర్చలు చివరి దశలో వున్నాయని తెలిసింది.

మరి కొద్ది రొజుల్లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్ టి ఆర్ కి నాగార్జునకి ప్రజల్లో మంచి అభిమానం వుంది. అలాగే వంశీ పైడిపల్లికి కూడా మంచి పేరుంది. కాబట్టి ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాదించే అవకాశం ఉందని పలువురు బావిస్తున్నారు.

Exit mobile version