‘తడాఖా’ సినిమాలో నటించిన ఆండ్రియా తన నటనతో చాలామందిని ఆకట్టుకుందట. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో సునీల్, తమన్నా ఈ అందాల భామ నటనను ప్రశంసించారు. తరువాత బెల్లంకొండ సురేష్ మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలిపారు. మీడియా సమావేశంలో “తెలుగులో ఆండ్రియాకు ఇది మొదటి సినిమా అయినా ఆమె మంచి పాత్రలో నటించింది. నాగార్జున గారు ఈ సినిమాను చూసి ఆమె నటన ఆయనను ఆకట్టుకుందని తెలిపారు. అంతే కాక ఆమెను తదుపరి సినిమాలో కూడా తీసుకొమ్మని సలహా ఇచ్చారని”చెప్పారు. దీనిబట్టి ఆండ్రియా తదుపరి ఏ చిత్రంలో నటిస్తుంది అనేది ఉత్కంటగా మారింది. ఈ సినిమా కాకుండా ఆమెను ప్రిథ్వి రాజ్ సరసన ‘లండన్ బ్రిడ్జ్’ అనే మలయాళం సినిమాలో, కమల్ సరసన ‘విశ్వరూపం 2’ లో, ‘ఎంద్రెంద్రం పున్నాగై’ సినిమాలో చూడొచ్చు.
‘తడాఖా’ సినిమాలో నాగ చైతన్య, సునీల్, తమన్నా మరియు ఆండ్రియా నటిస్తున్నారు. కిషోర్ పర్దాన్సి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బెల్లంకొండ సురేష్ నిర్మాత. థమన్ సంగీతాన్ని అందించాడు. ఆర్థుర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్. ఈ సినిమా మే 10న మన ముందుకురానుంది.