గ్రీకు వీరుడు సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్న నాగ్

గ్రీకు వీరుడు సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్న నాగ్

Published on Apr 20, 2013 1:15 PM IST
First Posted at 13.20 on Apr 20th

Greeku-Veerudu

కింగ్ నాగార్జున మోస్ట్ స్టైలిష్ లుక్ తో త్వరలో మన ముందుకు రానున్న సినిమా ‘గ్రీకు వీరుడు’. ఈ సినిమా విజయం సాధిస్తుందని నాగార్జున పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. ఇటీవలే థమన్ కూడా ఈ సినిమాకి సంబందించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలను పూర్తి చేసాడు. గత వారం స్పెయిన్ కి వెళ్ళిన నాగ్ తిరిగి హైదరాబాద్ కి రాగానే సినిమా ఫైనల్ వెర్షన్ చూసి సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు ‘ నిన్ననే గ్రీకు వీరుడు డబ్బింగ్ ఫినిష్ చేసాను. సినిమా సూపర్బ్ గా వచ్చింది. సమ్మర్ కూల్ ఎంటర్టైనర్ అని’ నాగార్జున ట్వీట్ చేసాడు.

దశరథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. మీరా చోప్రా, బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగార్జున ఫ్రెష్ లుక్, ఆడియో హిట్ అవ్వడంతో సినిమాపై అంచలానున్నాయి. డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 3న విడుదల కానుంది.

తాజా వార్తలు