టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. డైలాగ్ రైటర్ గా స్టార్ట్ అయి… వరుస సక్సెస్ లతో సూపర్ ఛాన్స్ కొట్టేసి.. డీసెంట్ కామెడీని హ్యాండిల్ చేయడంలో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రస్తుతం కామెడీ కింగ్ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో ‘ఎఫ్ 3’ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుండి మరో మల్టీస్టారర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
కాగా ఈ మల్టీస్టారర్ కోసం ప్రస్తుతం అనిల్ రావిపూడి కథను రాస్తున్నాడట. ఇప్పటికే తన తరువాత సినిమాని నాగార్జునతో చేయబోతున్నాడని, ఆ మధ్య నాగార్జున రావిపూడితో సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వచ్చాయి. నాగ్ – అఖిల్ కలయికలో అనిల్ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే వచ్చే ఏడాది చివర్లో నాగార్జున – అఖిల్ -అనిల్ రావిపూడి కలయికలో ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.