ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరిన్ని అంచనాలు పెంచే విధంగా నాగవంశీ చేసిన కామెంట్స్ కేజ్రీగా మారాయి. వార్ 2 లో ఎన్టీఆర్ ఇంట్రో అయితే చిరిగిపోద్ది అని వార్ అంటేనే యుద్ధం ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్ మామూలు లెవెల్లో ఉండవు అంటూ తాను మరింత ఎగ్జైట్ అయ్యారు. దీనితో ఈ కామెంట్స్ మరింత ఉత్సాహాన్ని ఫ్యాన్స్ లో తీసుకొచ్చాయి. ఇక ఇక్కడ నుంచి అభిమానులు ఆగస్ట్ 14 కోసం ఎదురు చూస్తున్నారు.