యంగ్ హీరో నాగ శౌర్య తన ఇమేజ్ కి భిన్నంగా చేసిన క్రైమ్ థ్రిల్లర్ అశ్వథామ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు రమణ తేజ ఆసక్తికరమైన సస్పెన్స్ తో ఆకట్టుకొనేలా తెరకెక్కించారు. నాగ శౌర్య చేసిన యాక్షన్ సన్నివేశాలతో పాటు మాస్ పరఫార్మెన్సు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా మొదటిరోజు అశ్వథామ మంచి వసూళ్లనే రాబట్టింది. అశ్వథామ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 3.6 క్రోర్ గ్రాస్ వసూలు చేసింది. ఇది నాగ శౌర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఫిగర్ కావడం విశేషం. పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నేడు మరియు రేపు ఆదివారం అశ్వథామ వసూళ్లు మరింత పెరిగే అవకాశం కలదు.
ఐరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉషా ముల్పూరి అశ్వథామ చిత్రాన్ని తెరకెక్కించారు. మెహ్రిన్ హీరోయిన్ గా నటించగా శ్రీచరణ్ పాకల సాంగ్స్ అందించారు. జిబ్రాన్ అశ్వథామ చిత్రానికి బీజీఎమ్ అందించడం విశేషం. హీరో నాగ శౌర్య స్వయంగా కథను అందించారు.