వెల్ కం రీమేక్లో నాగ చైతన్య ??

naga-chaitanya

“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం తరువాత మరో మల్టీ స్టారర్ చిత్రం రానుంది. పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య “వెల్ కం” చిత్ర రీమేక్లో నటించనున్నారు అక్షయ్ కుమార్ మరియు అనిల్ కపూర్ లు ప్రధాన పాత్రలలో వచ్చిన ఈ బాలివుడ్ చిత్రాన్ని తెలుగులో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మించనున్నారు. ఈ మధ్యనే ఈ చిత్ర రీమేక్ హక్కులను కొనాలని మంచు విష్ణు ముంబై వెళ్లారు. ప్రస్తుతం ఫిరోజ్ నదియవాలా తో చర్చలు జరుపుతున్నారు. నాగ చైతన్య ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్రలో కనిపించనున్నారు. మోహన్ బాబు మరియు శ్రీహరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యనే తన తండ్రిని ఒకానొక ప్రధాన పాత్రలో పెట్టి చిత్రాన్ని నిర్మించనున్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version