బిగ్ బాస్ సీజన్ 4 అభిమానులకు మరొక సప్రైజ్ ఉండనుంది. ఇన్నిరోజులు రానున్న దీపావళి ఎపిసోడ్ కు నాగర్జున ఉంటారా ఉండరా అనే కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. కానీ కరోనా నెగెటివ్ రిపోర్ట్స్ రావడంతో నాగర్జున షోకు వస్తారని కన్ఫర్మ్ అయింది. ఆయనతో పాటే నాగ చైతన్య కూడ షోకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. చైతూ హౌస్లోకి అతిథిగా రానున్నారట. దీంతో ఈసారి దీపావళి ఎపిసోడ్ సందడి సందడిగా ఉండనుంది. గత వారం హౌస్లోకి యాంకర్ సుమ అతిథిగా ప్రవేశించిన సంగతి తెలిసిందే.
ఆ ముందు వారం అక్కినేని అఖిల్ షోకు రావాంతో టిఆర్పీలు పుంజుకున్నాయి. అలాగే నాగర్జున అందుబాటులో లేక వ్యాఖ్యాతగా సమంత వ్యవహరించగా ఆ ఎపిసోడ్ కు మంచి రేటింగ్స్ నమోదయ్యాయి. ఈ వారం నాగర్జునతో పాటు నాగ చైతన్య కూడ షోలో కనబడితే టిఆర్పీలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి అక్కినేని ఫ్యామిలీ సెలబ్రిటీలు బిగ్ బాస్ షోను విజయవంతం చేయడం కోసం వరుస సప్రైజెస్ ఇస్తున్నారు ప్రేక్షకులకు.