నవ యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా యంగ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “తండేల్” కోసం తెలిసిందే. ఈ ఏడాది తెలుగులో వచ్చిన హిట్ చిత్రాల్లో ఇది కూడా మంచి వసూళ్లు సాధించి క్లీన్ హిట్ అయ్యింది. ఇక బిగ్ స్క్రీన్ పై అలాగే ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం బుల్లితెరపై మంచి రెస్పాన్స్ ని అందుకున్నట్టు తెలుస్తుంది.
కొన్ని రోజులు కితం జీతెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన ఈ సినిమా మొదటి టెలికాస్ట్ లో 10.32 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ అందుకుంది. దీనితో ఈ ఏడాదిలో జీ తెలుగు వరకు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరో హైయెస్ట్ రేటింగ్ గా తండేల్ రికార్డు సెట్ చేసింది. మొత్తానికి మాత్రం ఇక్కడ కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంపై దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు.