బుకింగ్స్ లో “తండేల్” ర్యాంపేజ్ మొదలు..!

మన టాలీవుడ్ యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో అక్కినేని నాగ చైతన్య తన నుంచి ఈ మధ్య కాలంలో ఏదొక వైవిధ్య పాత్రని చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలా చైతూ చేసిన లేటెస్ట్ సాలిడ్ సినిమానే “తండేల్”. తన కెరీర్లో మరో ఛాలెంజింగ్ రోల్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఇపుడు సాలిడ్ మౌత్ టాక్ ని మేకర్స్ పెట్టుకున్న అంచనాలకి తగ్గట్టుగా అందుకుంది.

అయితే ఈ సినిమా 1 డే బుకింగ్స్ మార్నింగ్ షోస్ నుంచి బాగానే ఉన్నాయి. మరి ఎప్పుడైతే పాజిటివ్ టాక్ బయటకి వచ్చిందో బుక్ మై షోలో బుకింగ్స్ ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. గంటకి 11 వేలకి పైగా టికెట్స్ బుకింగ్స్ తో సూపర్ ట్రెండింగ్ లో తండేల్ అదరగొడుతుంది. దీనితో తండేల్ ర్యాంపేజ్ ఇక మొదలైంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని దేవిశ్రీ ప్రసాద్ బ్యూటిఫుల్ సంగీతం అందించగా నిర్మాత బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

Exit mobile version