ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలుగొందిన నదియా ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. ఈ సంవత్సరం నదియా ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ కి అమ్మగా కనిపించింది. అలాగే ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అత్తగా కనిపించింది. ఈ రెండు సినిమాలు నదియాకి మంచి గుర్తింపును తెచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమాలో నదియా మహేష్ బాబుకి అక్క పాత్రలో నటించనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఆగడు సినిమా కోసం ఓ భారీ పోలీస్ స్టేషన్ సెట్ వేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈనెల 27 నుంచి ప్రారంభం కానుంది. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మొదటి సారి తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.