మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “నాయక్” చిత్రం నైజాం డిస్ట్రిబ్యుషన్ హక్కులు రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర హక్కులను 11 కోట్ల రికార్డ్ ధరకు కొనుగోలు చేశారు. ఈ ప్రాంతానికి ఇదే అత్యధికం.
చిత్రంలో మాస్ మసాలా పాళ్ళు ఎక్కువ ఉండటంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాదించే అవకాశం ఉంది. నైజాం లో చరణ్ కి మంచి మార్కెట్ ఉండటంతో ఈ ధర పలికింది.
గతంలో ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యుషన్ ని గీత ఆర్ట్స్ మరియు నైజాం కలిసి చేయ్యలనుకున్నారు కాని ప్రస్తుతం దిల్ రాజు మాత్రమే సోలోగా ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతికి రాబోతున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడం ఆసక్తికరం. 2013 సంక్రాంతి పోటీ మంచి వేడిగా సాగేలా కనిపిస్తుంది కదూ