మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’ ఈ వారం భారీ ఎత్తున రిలీజ్ కావడానికి సిద్దమవుతోతోంది. ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్లో వస్తున్న మొదటి సినిమా, అలాగే ప్రేక్షకులకు ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది, ఆ రోజు ఉదయం కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ పడే అవకాశం ఉంది.
ఈ సినిమాని హైదరాబాద్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు, అలాగే ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్ – అమలా పాల్ ఆడిపాడిన ఈ సినిమాకి వి.వి వినాయక్ డైరెక్టర్. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాకి నిర్మాత డి.వి.వి దానయ్య.