ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : మే 25, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : తనికెళ్ళ భరణి, రాజ్యలక్ష్మి, సతీష్, విన్నీ, బ్రాహ్మణి తదితరులు.
దర్శకులు : వేగేశ్న సతీష్
నిర్మాతలు : వేగేశ్న సతీష్
సంగీతం : ఎస్ కె బాల చంద్రన్
సినిమాటోగ్రఫీ : దాము నర్రావుల
ఎడిటింగ్ : మధు
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారం అవుతున్న వీక్లీ సిరీస్ కథా సుధలో లేటెస్ట్ ఎపిసోడ్ నే నాతి చరామి. దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన ఈ ఎపిసోడ్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
ఒక చిన్న పల్లెటూరిలో ఎంతో అన్యోన్యంగా ఉండే వయసైన దంపతులు వీరభద్రం (తనికెళ్ల భరణి) అలాగే తన భార్య జానకి (రాజ్య లక్ష్మి)లు. అయితే ఒకరోజు ఉదయం ఆకస్మికంగా తన భార్య కనిపించకపోయేసరికి కంగారు పడి వీరభద్రం పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. మరి ఇక్కడ నుంచి కథ ఎలా మారింది? జానకి ఎక్కడికి వెళ్లారు? ఎవరితో ఉంటున్నారు? పోలీసులకి వీరభద్రం తన భార్య విషయంలో తప్పని తెలిసినా కూడా ఎందుకు అబద్దం చెప్పారు? చివరికి తన భార్యని కలుసుకున్నారా లేదా అనేది తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ ని చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం బాగా తెలిసిన దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి మరో మంచి ప్రయత్నమే ఇది అని చెప్పవచ్చు. పెళ్ళిలో ఇద్దరు భార్య భర్తలు నడుమ నాతి చరామి అనే పదానికి ఉన్న గొప్పతనాన్ని తన మార్క్ లో ఆవిష్కరించిన విధానం దానికి ముగింపు బాగున్నాయి.
అలాగే సీనియర్ నటులు తనికెళ్ళ భరణి తమ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో కదిలిస్తారు. అంతే కాకుండా తన భార్యగా చేసిన నటి రాజ్య లక్ష్మి కూడా తన పాత్రకి పర్ఫెక్ట్ గా కుదిరి ఇద్దరి నడుమ ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ క్లైమాక్స్ పోర్షన్ లో వర్కౌట్ అవుతాయి.
ఇక వీటితో పాటుగా ఈ ఎపిసోడ్ మిడ్ లో వచ్చే ట్విస్ట్ నుంచి కథనం బాగుంది అని చెప్పవచ్చు. ఆ ట్విస్ట్ నుంచి ఒక భావోద్వేగంతో కూడిన అర్ధవంతమైన ముగింపు డీసెంట్ గా అనిపిస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ పార్ట్ వరకు బాగానే ఉంది కానీ మొదటి 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో నడిచే డ్రామా మాత్రం అంత ఆసక్తిగా సాగలేదు. చాలా రొటీన్ గా సాగుతుంది. అలాగే తన భార్య కోసం భర్త చేసే ప్రయత్నంలో అర్ధం ఉంది కానీ ఇది ఇది వరకే చూసినట్టుగానే రొటీన్ గానే అనిపించక మానదు.
మొత్తం ఎపిసోడ్ 30 నిమిషాలు అలానే కావచ్చు కానీ ఇందులో కూడా సగం మేర బోరింగ్ గానే అనిపిస్తుంది. కథనం ఇంకొంచెం బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి దాదాపు ఈ తరహా ట్రీట్మెంట్ నే రిపీటెడ్ గా ఈ కథా సుధలో కనిపిస్తుంది. ఎక్కడో ఒక దగ్గర బాగా వీక్ అండ్ రొటీన్ డ్రామా ప్లే సాగుతుంది.
సాంకేతిక వర్గం:
ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సెటప్ అంతా చిన్నగా క్లీన్ గా చూసేసుకున్నారు. సంగీతం, సినిమాటోగ్రఫీలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఓకే కొన్ని సీన్స్ ని కట్ చేసి రన్ టైం ఇంకా తగ్గించినా బాగానే ఉండేది. ఇక దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి ఈ ప్రయత్నంలో ఎమోషనల్ పార్ట్ వరకు మెప్పిస్తుంది కానీ మొదటి పావుగంట మాత్రం అంత ఎంగేజింగ్ గా సాగలేదు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘నాతి చరామి’ ఈటీవీ విన్ లఘు చిత్రంలో ఎమోషనల్ పార్ట్ వరకు ఓకే అనిపిస్తుంది అలాగే సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, రాజ్య లక్ష్మిలు చాలా బాగా చేశారు. కానీ మిగతా అంతా అంతగా ఆకట్టుకోలేదు. ఉన్న అరగంట ఎపిసోడ్ లో సగం మేర ఎపిసోడ్ అంత ఇంట్రెస్ట్ గా అనిపించదు. సో కేవలం కొంతమేర మాత్రమే ఈ ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team