పవన్ పొలిటికల్ ఎంట్రీపై వీడని మిస్టరీ

Pawan-Kalyan

ప్రస్తుతం అన్నిచోట్లా అందరూ డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ గురించే అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. పవన్ మార్చి రెండవ వారంలో తన రాజకీయ అరంగేట్రం పై క్లారిటీ ఇవ్వనున్నాడని తెలిపారు. కానీ అభిమానులు, రాజకీయ అభిమానులు అన్ని రోజులు ఎదురుచూడలేకపోతున్నారు.

మీడియాలోని కొంతమంది పవన్ కొత్త పార్టీ పెడతాడని అంటుంటే, మరికొంతమంది బాగా పేరున్న ఓ పొలిటికల్ పార్టీ నుండి తన రాజకీయ ప్రవేశం జరుగుతుందని అంటున్నారు. తాజాగా ఈ రోజు సాక్షి పత్రిక వారు పోస్ట్ చేసినదాని ప్రకారం పవన్ ‘ పవన్ కళ్యాణ్ రిపబ్లికన్ పార్టీ’ మొదలు పెడతారని
తెలిపారు.

ఇలా ఎన్ని వార్తలు వస్తున్నా పవన్, అతని సన్నిహితులు మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఏమీ చెప్పడంలేదు, అలాగని వచ్చిన వార్తలపై కూడా స్పందించడం లేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ చాలా ప్రైవేట్ వ్యక్తి, అలాగే అతని భావాలను కూడా అందరితోనూ షేర్ చేసుకోడు.

పవన్ కళ్యాణ్ మనసులో ఉన్న ప్లాన్స్ ఏంటి అనేది తెలియాలంటే మార్చి రెండవ వారం వరకూ ఎదురు చూడాల్సిందే..అప్పటి వరకూ ఆ విషయంపై పలు రకాల వార్తలు వస్తూనే ఉంటాయి..

Exit mobile version