నా చిరునవ్వే నా అందానికి ముఖ్య కారణం : సుస్మితా సేన్


అందాల భామ సుస్మితా సేన్ ని సినీ ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1994 లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకున్న ఈ భామ ఆ తర్వాత ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు కొంత విరామం ఇచ్చి తన కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నారు. ఆమె మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నా సమయాన్ని అంతా నా ఇద్దరి పిల్లలతోనే గడుపుతున్నాను. సినిమాల గురించి ఆలోచించడం లేదు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఇటీవలే కొన్ని కథలు కూడా విన్నాను అందులో మూడు కథలు నచ్చాయి, వాటిలో ఏదైనా ఒక సినిమా చేద్దామని ఆలోచిస్తున్నానని’ ఆమె అన్నారు.

నిన్న హైదరాబాద్ కి వచ్చిన సుస్మితా సేన్ మీడియా తో మాట్లాడుతూ ‘ నాకు హైదరాబాద్ తో ఒక ప్రత్యేకమైన అనుబందం ఉంది. నీను ఇక్కడే జన్మించాను, నేను హైదరాబాద్ కి వచ్చిన ప్రతి సారి ఒక కొత్త అనుభూతికి లోనవుతాను. ఒక నటిగా, తల్లిగా మరియు ఒక మహిళగా ప్రతిరోజూ నా కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాను. నా ఇద్దరు పిల్లాలూ అమ్మాయిలే కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలు లేకుండా ప్రపంచాన్ని ఊహించగలమా? అని’ అన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ ‘ మనుషులకి నెగిటివ్ ఆలోచనలు లేకపోతే ఎంతో అందంగా కనిపిస్తారు. మన మనస్సు చాలా పరిశుద్ధంగా ఉండాలి, మీ యొక్క చిరునవ్వే ఎదుటివారిలో మీపై మంచి అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంది, స్వచ్చమైన నవ్వే నిజమైన అందం. నా అందానికి కారణం నా చిరునవ్వే’ అని ఆమె అన్నారు. సుస్మితా సేన్ నవ్వు చాలా బాగుంటుంది కనుక ఆమె చ్ప్పిన విషయాన్ని మనం అంగీకరించాల్సిందే.

Exit mobile version