పంచ్ డైలాగ్స్ రాస్తానని నాకే తెలియదు – త్రివిక్రమ్

పంచ్ డైలాగ్స్ రాస్తానని నాకే తెలియదు – త్రివిక్రమ్

Published on Oct 24, 2013 8:50 AM IST

trivikram-srinivas
త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరు వినగానే మీకు గుర్తు వచ్చేడి సూటిగా గుచ్చుకునే వన్ లైన్ పంచ్ డైలాగ్స్. చాలా మంది ఆయన ప్రాస కోసం ఈ పంచ్ డైలాగ్స్ రాస్తుంటారని అంటుంటారు. అదే విషయాన్నీ ఆయన ముందు ఉంచితే అలాటిదేమీ లేదని అంటున్నారు.

ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘ పంచ్ డైలాగ్స్ రాస్తానన్న నిజం నాకే తెలియదు. నేను సీన్ కి తగ్గట్టు డైలాగ్స్ రాసుకుంటాను. ఉదాహరణకి.. అత్తారింటికి దారేదిలో రాసిన ‘ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు’ డైలాగ్ ని పంచ్ కోసం రాయలేదు. ఆ సందర్బానికి అలాంటి వాక్యం కావలి కాబట్టి రాసాను. కానీ ఆడియన్స్ అలా ఫీలవుతున్నారని’ అన్నారు.

అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గబ్బర్ సింగ్ 2 కి మాటలు రాయడం లేదని తెలిపారు. కానీ త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కలిసి ‘కోబలి’ అనే సినిమాని నిర్మించనున్నారు. ‘ రాయలసీమని బేస్ చేసుకొని నడిచే కథ ఇది. కోబలి అవార్డు సినిమా, ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఓ రీసర్చ్ జరుగుతోంది. నేను – పవన్ కళ్యాణ్ నిర్మించబోయే ఈ సినిమా త్వరలో మొదలవుతుందని’ తెలిపారు.

తాజా వార్తలు