పవన్ చిత్రానికి ప్రధాన బలం కానున్న దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

pawan-kalyan-and-dsp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా భారీ రీతిలో ఫాన్స్ ను అలరించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆల్బమ్ రూపుదిద్దుకుంటున్న తీరుపై కొన్ని మంచి వార్తలు వినిపిస్తున్నాయి . దేవి తనకున్న అనుభవాన్నంతా కష్టం రూపంలో పెట్టి మరీ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నాడట. ఒక విధంగా ఈ సినిమాకు అతనో ప్రధాన బలంగా నిలవనున్నాడు.

వచ్చే కొన్ని వారాల వరకూ ఈ సినిమా బృందమంతా యూరోప్ లో చిత్రీకరణ జరుపుకుంటారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్. ప్రణీత రెండో హీరోయిన్ పాత్రని పోషిస్తుంది.

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమా ఒక స్టైలిష్ ఎంటర్టైనింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుంది. ప్రేక్షకులకు కావలిసినంత మోతాదులో త్రివిక్రమ్ మార్కు కామెడీ ఉండనుంది.

Exit mobile version