“అవెంజర్స్” సీన్ తో అవేర్ నెస్ తెస్తున్న ముంబై పోలీస్.!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గత ఏడాది విడుదల కాబడిన “అవెంజర్స్ ఎండ్ గేమ్” నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబడిన అన్ని చోట్లా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి వసూళ్ల సునామీని సృష్టించింది. అలాగే దీనికి ముందు వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కూడా అంతే స్థాయి ప్రభంజనం సృష్టించింది. అయితే అన్ని సినిమాల్లోనూ ఉన్నట్టుగా ఈ సినిమాలోనూ కొన్ని నోటెడ్ మరియు ఫన్నీ సన్నివేశాలు ఉన్నాయి.

అలాంటి వాటిలో వఖాండాలో బ్రూస్ బ్యానర్ కు మరియు ఆ రాజ్యపు యువరాజు టి’చాల్లా లు కలిసినపుడు బ్రూస్ వారికి గౌరవార్ధం నమస్కారం చేస్తాడు దానికి అతను ఇలాంటివి ఏమి మేము చెయ్యము అంటాడు. ఈ పర్టిక్యులర్ సీన్ అంతర్జాలంలో చాలా ఫేమస్ ఇప్పుడు అదే సీన్ ను ఉపయోగించి ముంబై పోలీసు వారు ప్రస్తుత పరిస్థితుల్లో స్ప్రెడ్ అవుతున్న ఫేక్ న్యూస్ ను ఉద్దేశించి అలాంటి పనులను మేము చెయ్యము అంటున్నారు. ఫార్వార్డెడ్ గా వచ్చే ఫేక్ న్యూస్ కు ఎండ్ గేమ్ వెయ్యాలని ఈ ఫోటో పెట్టి తమదైన శైలిలో ముంబై ప్రజలను అలెర్ట్ చేస్తున్నారు.

Exit mobile version