తెలుగు ప్రేక్షకులకు అచ్చమైన తెలుగు కుటుంబ కథా చిత్రం అందించాలనే ఉద్దేశంతో 24 క్రాఫ్ట్స్ అనే బ్యానర్ పెట్టి సివి రెడ్డి గారి సమర్పణలో నిర్మించిన సినిమా ‘ముద్దుగా’. విక్రాంత్, పల్లవి ఘోష్ హీరో హీరోయిన్స్ గా పరిచయం కానున్న ఈ మూవీ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ కుమార్ మాట్లాదుతూ ‘చక్కని కుటుంబ విలువలతో తెరకెక్కించాం. కుటుంబం అంతా కూర్చొని చూడదగిన సినిమా. ఇటీవల వచ్చిన ఉయ్యాలా జంపాలా సినిమా లాంటి అచ్చ తెలుగు సినిమా ఇది. సెన్సార్ వారు కూడా ఈ సినిమా చూసి మెచ్చుకొని మరీ క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో సినిమా ప్రేక్షకులకి కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నానని’ అన్నాడు. ‘కామెడీ, సీరియస్, లవ్, ఫ్యామిలీ అన్నీ కలగలిపిన సినిమా ముద్దుగా. కచ్చితంగా విజయం సాదిస్తుందని నమ్మకం ఉందని’ హీరో విక్రాంత్ అన్నాడు