మిస్టర్ నూకయ్య తప్పక అలరిస్తాడు: మనోజ్

మిస్టర్ నూకయ్య తప్పక అలరిస్తాడు: మనోజ్

Published on Mar 7, 2012 11:05 AM IST


రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ సినిమా రేపే విడుదల కాబోతుంది. మనోజ్ మాట్లాడుతూ మిస్టర్ నూకయ్య మినిమమ్ గ్యారంటీ ఎంటర్టైనర్ సినిమా అంటున్నాడు. ప్రతి ఒక్కరిని తప్పక అలరిస్తుందని అంటున్నాడు. ఈ సినిమాలో హీరో మనోజ్ మరియు హీరోయిన్స్ సనా ఖాన్, కృతి ఖర్భంద మధ్య రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్ బాగా పండిందని చెబుతున్నాడు. మనోజ్ ఈ సినిమాలో సెల్ ఫోన్ దొంగగా కనిపించబోతున్నాడు. అని కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు మనోజ్ స్వయంగా దర్శకత్వం వహించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో యువతని బాగా ఆకర్షిస్తుంది.

తాజా వార్తలు