‘మోగ్లీ’ సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంతో తెలుసా..?

Mowgli

టాలీవుడ్‌లో ‘కలర్ ఫోటో’ వంటి జాతీయ అవార్డు అందుకున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రాజ్ తన నెక్స్ట్ వెంచర్‌గా రూపొందిస్తున్న చిత్రమే ‘మోగ్లీ’. ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రోషన్ కనకాల, సాక్షి మదోల్కర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ‘అఖండ 2’ కారణంగా ఒక రోజు వెనక్కి వెళ్లింది.

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సినిమాకు 2 గంటల 40 నిమిషాల రన్‌టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలోని యాక్షన్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు.

కాగా, ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తుండగా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version