ప్రతివారం లాగే ఈ వారం కూడా బాక్సాఫీస్, ఓటీటీల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. థియేటర్స్లో ఈ వారం సందడి చేయబోయే సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ టాప్ ప్లేస్లో ఉంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తాడని అభిమానులు భావిస్తున్నారు. జ్యోతికృష్ణ, క్రిష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేయగా జూలై 24న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘మహావతార్ నరసింహా’ జూలై 25న గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. 2డి, 3డి లో వస్తున్న ఈ సినిమాను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రహ్లాద చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఓటీటీలో కూడా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు, సిరీస్లు స్ట్రీమింగ్కు రానున్నాయి. మరి అవి ఏమిటో ఇక్కడ చూద్దాం.
నెట్ఫ్లిక్స్ :
మండల మర్డర్స్ (వెబ్ సిరీస్) – జూలై 25
జియో హాట్స్టార్ :
సర్ జమీన్ (హిందీ చిత్రం) – జూలై 25
అమెజాన్ ప్రైమ్ :
జస్టిస్ ఆన్ ట్రయల్ (వెబ్ సిరీస్) – జూలై 21
టిన్ సోల్జర్ (ఇంగ్లీష్) – జూలై 23
రంగీన్ (వెబ్ సిరీస్) – జూలై 25